తెలంగాణ పోలీసులను ఆశ్రయించనున్న.. పవన్‌ కల్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ పోలీసులను ఆశ్రయించనున్న.. పవన్‌ కల్యాణ్

April 24, 2018

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై కుట్రలు చేస్తున్న మీడియా ఛానెళ్లు, వాటి యాజమానులపై ట్వీట్ల పోరాటం మొదలు పెట్టాడు. ఈ ఉదయం రవిప్రకాశ్‌తో పాటుగా శ్రీని రాజులపై విమర్శలతో విరుచుకుపడ్డారు.  ఆ తర్వాత గత ఆరునెలల నుంచి తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు కోసం తెలంగాణ పోలీసులను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు మరో ట్వీట్ చేశాడు.ఈ దెబ్బతో తనను ఇరుకున పెట్టి అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించిన ,పురుషులు,మహిళల జాతకాలన్ని బయటకు వస్తాయని , అది క్రమంగా అమరావతికి దారి తీస్తుందని పవన్ అన్నారు.  ‘ఒకవేళ దర్యాప్తు జరిగితే ప్రముఖుల కుటుంబాలు, రాజకీయ నాయకులు, మీడియా అధిపతులు, వారి పిల్లలు ,అందరూ బయటకు వస్తారు. సమాజంలోని కుళ్లంతా బయటపడుతుంది’ అని పవన్‌ పేర్కొన్నారు.

‘మీరంతా కలిసి ఓ చెల్లి బట్టలిప్పేలా ప్రోత్సహించారు. దాన్ని మీడియా షో చేసింది. కానీ, దర్యాప్తులో వెలుగు చూసే నిజం మీ షోలన్నింటి కంటే పెద్దదే అవుతుంది’ అంటూ వరుస ట్వీట్లు చేశారు. టీడీపీ అనుకూల మీడియా ఛానెళ్లకు, వాటి అధినేతలకు, భాగస్వాములకు, బోర్డు సభ్యులకు అందిరికీ త్వరలోనే లీగల్‌ నోటీసులు పంపుతానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. వాటికి స్పందించేందుకు వారికి తగిన సమయం కూడా ఇస్తానని ఆయన ట్వీట్‌ చేశారు.