పవన్ కల్యాణ్ పార్టీతో మాకు ఢోకా లేదు.. జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ పార్టీతో మాకు ఢోకా లేదు.. జగన్

February 1, 2018

 జనసేన పార్టీ ప్రభావం తమ పార్టీ మీద ఏమాత్రం పడబోదని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ గానీ, పవన్ కల్యాణ్ గానీ మాకు ఏ రకంగానూ పోటీ కాలేరు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడకుండా జనసేన అడ్డుకుంటుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అది అబద్ధపు ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు.గత ఎన్నికల్లో టీడీపీ మాకంటే కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ సాధించింది. అది గెలుపని నేననుకోవటం లేదు. చంద్రబాబు, మోడీ కలిసి ప్రచారం చేయటం వల్ల ఆమాత్రం మెజారిటీ సాధించారు. లేదంటే గెలుపు వైసీపీదే అయ్యేదని వ్యాఖ్యానించారు. పొత్తుల గురించి ప్రస్తావించినప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లడటం అనవసరం. అప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుందని జగన్ పేర్కొన్నారు.