మొత్తానికి పవన్ అజ్ఞాతవాసే - MicTv.in - Telugu News
mictv telugu

మొత్తానికి పవన్ అజ్ఞాతవాసే

November 27, 2017

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తోన్న కొత్త సినిమాకు చిత్ర యూనిట్ మొత్తానికి పేరును ఖరారు చేసింది. ‘అజ్ఞాతవాసి’ మా సినిమా పేరంటూ ఓ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో పవన్ సోఫాలో కూర్చుని ఐడీ కార్డును చేతి వేలుకు చుట్టుకుని తిప్పుతున్న ఫోజు అభిమానులను ఆకట్టుకుంటోంది.

కీర్తీ సరేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. వారణాసిలో జరుగుతున్న చివరి షెడ్యూల్ పూర్తి అయితే ఈసినిమా షూటింగ్ దాదాపు అయిపోయినట్టే అని తెలుస్తోంది. తర్వాత పవన్ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని, అనంతపురం నుంచి పాద యూత్ర కూడా చేపడతారని సమాచారం.