పవన్ మళ్లీ పాటందుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ మళ్లీ పాటందుకున్నాడు

November 21, 2017

‘అత్తారింటికి దారేది’  సినిమాలో  పవన్ కళ్యాణ్ పాడిన కాటమరాయుడా కదిరి నరసింహుడా అనే పాట ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే. అయితే  త్రివిక్రమ్‌తో చేస్తున్న మూడో సినిమాలో కూడా..డైరెక్టర్ త్రివిక్రమ్  పవన్ తో ఓ పాట పాడించబోతున్నారని సమాచారం. ‘కొడకా కోటేశ్వరరావ్’  అనే లిరిక్స్ తో పాట  మొదలవుతందని చెబుతున్నారు.  ఇప్పటికే ఈసినిమాలోని  ‘బైటికెళ్లి చూస్తే’ అనే లిరికల్ పాట య్యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.  మరి  కాటమరాయుడా మాదిరి గానే  పవన్ పాడబోయే  ఈపాట కూడా దానికంటే  పదింతలు  ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది.  ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి  చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నారు.