మీఅన్నగా,తమ్ముడిగా మీ ముందుకొచ్చా : గుంటూరు సభలో పవన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

మీఅన్నగా,తమ్ముడిగా మీ ముందుకొచ్చా : గుంటూరు సభలో పవన్ !

March 14, 2018

గుంటూరులో జనసేన ఆవిర్భావ మహాసభ మొదలైంది. పవన్ అభిమానులు, కార్యకర్తలు సభకు భారీగా తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ ‘ ప్రజల కష్టాలు చూసే నేను జనసేన పార్టీ పెట్టాను. ప్రజల పక్షాన నిలబడేందుకే జనసేన వచ్చింది. నాకు సేవ చేయడం ఇష్టం,సమస్యలపై పోరాటం చేయడం ఇష్టం. మీ అన్నగా తమ్ముడిగా మీ ముందుకొచ్చాను.

కేంద్ర ప్రభుత్వం అంటే మాకు భయం లేదు. విభజన హామీలు కేంద్రం నెరవేర్చలేదు. మాట తప్పి మాకు అన్యాయం చేస్తారా? అనైతికంగా తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఏ సెంటిమెంట్ తో తెలంగాణ ఇచ్చారు చట్టాలు మాకే కాని మీకు కాదా? అవినీతి నేతలకు కేంద్రం అంటే భయం ఉండొచ్చు, మాకు కాదు. మమ్మల్ని తొక్కించుకోవడానికే మిమ్మల్ని గద్దెనెక్కించామా? మీరు గౌరవించని చట్టాలు మాకెందుకు? మాకు డబ్బు కాదు ఆత్మ గౌరవం ముఖ్యం’ అని పవన్ అన్నారు.