పవన్ ఏమన్నాడని ఆమె అంతపెద్ద మాట అంది.. నాగబాబు - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ ఏమన్నాడని ఆమె అంతపెద్ద మాట అంది.. నాగబాబు

April 18, 2018

నటి శ్రీరెడ్డి పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ‘ ఆమె ఎవరో నాకు తెలియదు. కానీ ఆమె మాట్లాడింది చాలా తప్పు. పవన్ ఏమన్నాడని ఆమె అంత పెద్ద మాట అంది. సమస్యలుంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమని చెప్పడం తప్పా ? ఇండస్ట్రీలో ఆడవాళ్ళంటే మాకు చాలా గౌరవం వుంది. నా కుమార్తెను ధైర్యంగా ఇండస్ట్రీకి తెచ్చాను. నా తమ్ముడు ఈ వ్యవహారంపై రియాక్ట్ అవొద్దని చెప్పినా నేను వచ్చి స్పందిస్తున్నాను. టీవీ ఛానళ్ళు కూడా నోటికొచ్చినట్టు వాగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడకండి. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వుంది. దళారీ వ్యవస్థను రూపుమాపుతాం. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది ’ అన్నారు నాగబాబు.సైలెంట్‌గా వున్నామని మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి.. మెగా ఫ్యామిలీ గురించి అంత ఈజీగా తీసుకోకండి అని మండిపడ్డారు. ఒక వ్యక్తిని ఎదరుకోవడం చేత కాకపోతే.. అతని వ్యక్తిత్వాన్ని ఎండగట్టే చేతకాని దద్దమ్మలు తయారయ్యారు. మా తమ్ముడు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు.. అతను నెంబర్ వన్ స్టార్.. అతణ్ణి విమర్శించే స్థాయి ఎవరికీ లేదని అన్నారు. త్వరలోనే అందరి దూల తీరుస్తాడు పవన్. దీన్ని ఇంతటితో ముగించండి.. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అన్నారు. పవన్ ఫ్యాన్స్ ట్రాల్ చెయ్యొద్దని అనటానికి వీల్లేదు అని తెలిపారు.