చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా చప్పట్లు! - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా చప్పట్లు!

February 10, 2018

రాష్ట్ర  విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత  పార్లమెంట్‌లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కవితకు కృత్ఝతలు తెలుపుతూ  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.  ‘విభజన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్‌కు మద్దతు ఇచ్చిన చెల్లెలు కవిత గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు కవిత మద్దతు ఇవ్వడం సంతోషకరమని ఆయన అన్నారు..రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ఏపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని కవిత బడ్జెట్ సమావేశాల్లో తెలిపిన సంగతి తెలిసిందే.