పవన్ ఆవిష్కరించిన ‘2 కంట్రీస్’ టీజర్‌ - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ ఆవిష్కరించిన ‘2 కంట్రీస్’ టీజర్‌

November 25, 2017

‘ జై బోలో తెలంగాణ ’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఎన్. శంకర్ ‘ 2 కంట్రీస్ ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు.

‘ పెళ్లంటే ఓ లాటరీలాంటిది. తగిలిందనుకో హ్యాపీ..లేకపోతే బీపీయే’ అని సునీల్‌తో శ్రీనివాస్‌రెడ్డి చెప్పే డైలాగ్‌తో టీజర్ ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకుంటున్నది. సునీల్, మనీషా రాజ్ జంటగా నటిస్తున్న లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. చాలా కాలం నుండి సరైన హిట్టు లేక సతమవుతున్న సునీల్‌కు ఈ సినిమా మంచి బ్రేకిస్తుందని భావిస్తున్నాడు సునీల్. ఈ సినిమా టీజర్‌ను పవన్ విడుదల చేయడంతో సినిమాకు మరింత హైప్ చేకూరిందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ‘టీజర్ చాలా ఫన్నీగా వుంది. తప్పకుండా ఈ సినిమా హిట్టు అవుతుందని భావిస్తున్నానని ’ పవన్ కళ్యాణ్ అన్నారు.  అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి డిజెంబర్ నెలాఖరుకల్లా సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.