కత్తీ.. నీ ఆరోగ్యం పాడైపోతుంది:  పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

కత్తీ.. నీ ఆరోగ్యం పాడైపోతుంది:  పవన్

December 9, 2017

టైం దొరికినప్పుడల్లా పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసే కత్తి మహేష్‌పై పరవ్ స్టార్ పవన్ కల్యాణ్ ఘాటు సెటైర్లు వేశారు. తనను ద్వేషించమే పనిగా పెట్టుకుని కత్తి మహేష్  ఆరోగ్యం దెబ్బతింటుందని, ముఖం అందవికారంగా మారిపోతుందని ఎద్దేవా చేశారు.

‘ ఎవరైనా బలమైన గొంతును వినిపిస్తున్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ముందుంటారు. ఇలాంటి వాటిని నేనస్సలు పట్టించుకోను. నేను బంగారాన్ని కాదు.. అందరిలాంటి మనిషినే. నాలోని అంశాలు కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. తనను పనిగట్టుకొని ద్వేషించేవారు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని గమనించాలి. మనిషి నవ్వితే శరీరంలోని కండరాలు కొంత మేర కదులుతాయి. ఒకరిని ద్వేషిస్తే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. అలాగే రక్తం, ముఖంలోని కండరాలు కూడా పాడు అవుతాయి. జనసేన కార్యకర్తలు కూడా తనలాగే వుండాలి ’ అంటూ కత్తిపై కారాలు మిరియాలు నూరారు పవన్.

విమర్శలు చేసేవారిని మనం అస్సలు పట్టించుకోవద్దని. లేకపోతే కొందరిని అనవసరంగా పెంచి పెద్ద చేశామని బాధ పడాల్సి వస్తుందన్నారు. తనను షబ్బీర్ అలీ, దానం నాగేందర్‌లు కూడా తిడతారు. కానీ ఎక్కడైనా కలిసినప్పుడు ఆత్మీయంగా మాట్లాడుతారు.

అది కనీస కర్టెసీ అన్నారు. ప్రతీ వ్యక్తికి సహనం వుండాలి. అలాగే మనం చచ్చిపోయేంత సహనం కూడా అంత మంచిది కాదన్నారు. మనం చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అలాగని దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. అవసరమైన సందర్భాల్లో స్వీయ రక్షణ చేసుకుందామన్నారు. ఎక్కడా కత్తి పేరు ఎత్తకుండా పవన్ మాట్లాడిన తీరుపై కత్తి ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.