పవన్ కల్యాణ్ కళ్లకు జబ్బు.. - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ కళ్లకు జబ్బు..

April 14, 2018

శుక్రవారం రాత్రి జరిగిన ‘రంగస్థలం’ విజయోత్సవ సభకు ప్రత్యేక అతిథిగా పవన్ కల్యాణ్ హాజరయ్యారు. రామ్ చరణ్ చిట్టిబాబు గెటప్‌లో రాగా పవన్ కల్యాణ్ తెల్లటి వస్త్రాల్లో, నల్లటి కళ్ళద్దాలతో రావటం గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఎండాకాలం సందర్భంగా కళ్ళకు చల్లదనం కోసం కూలింగ్ గ్లాసులు పెట్టుకోవడం పరిపాటి. కానీ రాత్రి వేళలో పవన్ గాగుల్స్ ఎందుకు పెట్టుకున్నట్టోనని అనుకున్నారు. టీవీల ముందు కూర్చున్న కొందరైతే పవన్‌కు కళ్ళద్దాలు అస్సలు సెట్ అవలేదబ్బా అని గుసగుసలు పెట్టుకున్నారు.  

డేలో పెట్టుకుంటేనే కళ్ళకు చీకట్లు కమ్మినట్టు కనిపిస్తాయి. ఇక రాత్రుళ్ళు పెట్టుకుంటే ఏమీ కనిపించదని పవన్‌కు తెలియదా అనుకున్నవాళ్ళూ వున్నారు. అయితే తన కళ్ళద్దాల మీద గుసగుసలు తన చెవి వరకు చేరినట్టున్నాయి. వెంటనే పవన్ తన గాగుల్స్‌పై స్టీజీ పైనే క్లారిటీ ఇచ్చారు. తాను నల్ల కళ్లజోడు పెట్టుకురావటానికి కారణం స్టైల్ కాదని.. తన కళ్లకు ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా వెలుగు పడకూడదని అందుకే కళ్ల జోడు పెట్టుకున్నా.. ఇదేం స్టైల్ కోసం పెట్టుకున్నవి కావని నవ్వుతూ చెప్పారు.

ఇదిలా వుండగా ఈ కార్యక్రమంలో జగపతిబాబు, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, చిత్ర నిర్మాతలు, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం పంచెకట్టులోనే కనువిందు చేయటం విశేషం.