పేటీఎంలో బంగారం పంపొచ్చు.. ఇన్వెస్ట్ చేయొచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

పేటీఎంలో బంగారం పంపొచ్చు.. ఇన్వెస్ట్ చేయొచ్చు

March 17, 2018

పేటీఎం తన వినియోగదారుల కోసం మరో రెండు రకాల సేవలను ప్రకటించింది. గోల్డ్ , గిఫ్టింగ్, గోల్డ్  సేవింగ్స్ ప్లాన్‌ను వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగం ద్వారా అందించనుందని తెలిపింది. వినియోదారులు 24 క్యారట్ల 999.9 స్వచ్ఛమైన బంగారాన్ని పేటీఎం ద్వారా ఒకరికి ఒకరు పంపుకోవచ్చని  పేర్కొంది.. దీన్నే బహమతి సేవగా పేర్కొంది. పేటీఎం డిజిటల్, భౌతిక రూపంలో బంగారం కొనుగోలుకు ముందు నుంచి అవకాశం కల్పిస్తోంది. రూపాయి చార్జీ లేకుండానే డిజిటల్ రూపంలో ఉంచుకోవడం లేదా ఫిజికల్‌గా కావాలంటే డెలివరీ తీసుకునే అవకాశం ఉంది.  60 శాతం బంగారం కొనుగోళ్లు టైర్ 2, 3 పట్టణాల నుంచే ఉంటున్నాయని ఈ సంస్థ అంటోంది.  వినియోగదారులకు వీలు కుదిరినప్పుడు రూ.500 మొదలుకొని బంగారం కోనుగోలు చేస్తున్నారని తెలిపింది. పేటీఎం గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ కింద  వినియాగదారులు తమ పొదుపు అవసరాల మేరకు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఫలానా రోజు ఎంత మొత్తం విలువ గల బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు తదితర వివరాలను నమోదు చేస్తే చాలు. సరిగ్గా అన్నిరోజులకు వారి ఖాతాలో ఆ లావాదేవీ జరిగిపోతుంది.