మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ ప్రజా ప్రతినిధులకు పెన్షన్

September 13, 2017

తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గ్రామాలకు పట్టుగొమ్మలైనటువంటి స్థానిక సంస్థల్లో  సర్పంచ్, ఎంపిటిసి, పట్టణాల్లో కౌన్సిలర్లుగా పాలన అందించి మాజీలుగా మిగిలిపోయిన మాజీ స్థానిక ప్రజా ప్రతినిధులైనటువంటి వాళ్ళకు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ పథకం ప్రవేశ పెట్టబోతున్నట్లు వినికిడి. తెలంగాణ ఉద్యమంలో శక్తి వంచన లేకుండా వనిచేసిన వీరిలో అనేక మంది ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు మాజీలు అంతా కలిసి 50 వేల వరకు ఉండవచ్చునని అంచనా. అయితే గ్రామాల్లో పట్టున్నటువంటి ప్రతినిధులే ఉంటారు. ఇటువంటివారికి ఇటువంటి పెన్షన్ అవకాశం కల్పిస్తే గ్రామాల్లో పట్టు ఉంటుందని ప్రభుత్వం భావిస్తన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా మాజీలుగా మారేవారు కాబట్టి వారు పెన్షన్ కోసం ఉద్యమించనున్నారని ఇందుకోసం ప్రణాళికలను తయారు చేస్తుండడంతో దీనికి కొంతమంది నాయకులు ,సంస్థలు నాయకత్వం వహించనుండడంతో పార్టీలకు అతీతంగా అందరు ఉద్యమానికి ఏకమయ్యే అవకాశం ఉంది.

దీంతో వారి నాయకత్వం క్రిందకు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఆ పేరు  ఇతరులకు రాకుండా ఉండేందుకు ఎంతో కొంత డబ్బులు నిర్ణయించి వారికి పెన్షన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తన్నట్లుగా తెలుస్తోంది. 4000 నుండి 5000 వరకు పెన్షన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వమున్నట్లు తెలుస్తోంది. అయినా ఉద్యమించనిది, ఆందోళనలు చెయ్యనిదే ఫలితాలు రావని, అందుకే వేలాది మంది మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పెన్షన్ పథకం కోసం  ఆందోళనకు సిద్దమవుతున్నట్టు తెలిస్తోంది.