పీపుల్ రెవల్యూషన్ అవసరం.. మోహన్ బాబు - MicTv.in - Telugu News
mictv telugu

పీపుల్ రెవల్యూషన్ అవసరం.. మోహన్ బాబు

April 20, 2018

ఓవైపు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తంగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తీవ్ర దూమారం రేగుతోంది. ఆ వివాదంలోకి రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ మహాత్మా.. నువ్వు స్వాతంత్య్రం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్.. ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్.. దీనికుంది ఒకే ఒక సొల్యూషన్.. అదే.. అదే.. పీపుల్ రెవల్యూషన్.. ’ అంటూ నేటి రాజకీయ వ్యవస్థ మీద తన అసహనాన్ని వ్యక్తం చేశారు.పోస్టు కింద ‘ శ్రీరాములయ్య ’ సినిమాలోని ఫోటోను కూడా జత చేశారు. ఈమధ్య ఆయన కొడుకు విష్ణు కూడా ఫిలింఛాంబర్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

"మహాత్మా.. నువ్వు స్వాతంత్య్రం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్.. ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్.. దీనికుంది ఒకే ఒక సొల్యూషన్.. అదే.. అదే.. పీపుల్ రెవల్యూషన్.." #MBDialogue #AdaviloAnna

Posted by Dr. M. Mohan Babu on Wednesday, 18 April 2018