సంక్రాంతికి పల్లెబాట.. రైళ్లు, బస్సుల్లో తోపులాట..

సంక్రాంతి పండగ ఫీవర్ మొదలైంది. జనవరి 14 న వస్తున్న పండగ కోసం

హైదరాబాద్ నగరం నుంచి తమ తమ స్వగ్రామాలకు వెళ్తున్నారందరు. విద్యార్థులకు సంక్రాంతి సెలవులు లభించడంతో పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు పల్లెలకు ప్రయాణమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిన జనాలతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతికి రైళ్ల రద్దీని తట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది దక్షిణ మధ్య రైల్వే. రెగ్యులర్‌గా నడిచే రైళ్ల బుకింగ్స్ అయిపోవడంతో కొత్తగా 13 రైళ్లను ప్రవేశపెట్టారు అధికారులు. అయినా ప్రయాణికుల రద్దీ నెలకొంది.Telugu news People who are going villages the Sankranthi festival .. trains and buses busy..ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండుల్లో కూడా ప్రయాణికుల రద్దీ వుంటోంది. ప్రైవేట్ బస్సుల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ కారణంగా అవి కూడా బిజీ అయిపోయాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ పేర్కొంది. కాగా, ఈ నెల 10వ తేదీ నుంచి రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అన్ని బస్సుల్లోనూ సీట్లు నిండుకున్నాయి.Telugu news People who are going villages the Sankranthi festival .. trains and buses busy..