గజ్వేల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా.. గద్దర్

ప్రజాగాయకుడు గద్దర్.. గజ్వేల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దూకుతున్నారు. ఆపద్ధర్మ సీఎం కెసీఆర్ పోటీ చేస్తున్న ఈ స్థానం నుంచి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ఈ రోజు ప్రకటించారు. మహాకూటమి తరఫున ప్రచారం చేస్తానని, ప్రజలు కోరితే కేసీఆర్‌పై పోటీ చేస్తానని గద్దర్ ఇదివరకే చెప్పారు.

గురువారం దీనిపై మరోసారి స్పష్టతనిచ్చారు.  ‘ఓటు మన రాజకీయాలను మారుస్తుంది కనుక జనం బాగా ఆలోచించి నేతలను ఎన్నుకోవాలి. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు.  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక రాజకీయాలు లేవు. వారి వద్దా జనం పాటలే పాడాను. రాజ్యంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరాను.

Telugu news peoples singer Gaddar to contest in Gajwel against TRS leader KCR in upcoming elections.

సీఐడీ అడిషినల్ డీజీని కలిసి నాకు భద్రతా కల్పించాలని కోరాను. సీఈఓకు కూడా ఇదే చెప్పాను.. ’ అని తెలిపారు. తన ప్రచారంపై మాట్లాడుతూ.. తొలి దశలో ఎస్టీ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఓటు హక్కుపై చైతన్యం కలిగిస్తానని, రెండో దశలో ఎస్సీల్లో, మూడో దశలో బీసీల్లో, నాలుగు దశలో నిరుపేదల్లోకి వెళ్లి ప్రచారం చేస్తానని వివరించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ లేకుంటే ఎన్నికలు, రాజ్యాంగం ఎందుకు అని అన్నారు.

Telugu news peoples singer Gaddar to contest in Gajwel against TRS leader KCR in upcoming elections