తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

తమిళనాడులో పెరియార్ విగ్రహం ధ్వంసం

March 7, 2018

త్రిపురలో బీజేపీ నేతలు విప్లవనేత లెనిన్ విగ్రహాన్ని కూల్చేసిన ఘటన మరువక ముందే.. తమిళనాడులోని వెల్లూరులో ప్రముఖ హేతువాది, ద్రవిడ ఉద్యమనేత పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అప్పుడు పెరియార్ విగ్రహాలను కూడా పెకిలిస్తామని త్రిపుర బీజేపీ నేత హెచ్.రాజా హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. విగ్రహంలోని ముక్కు భాగాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తుండగా గమనించిన స్థానికులు వారిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. వీరిలో ఒకరు బీజేపీ నేతగా గుర్తించారు. దీంతో, బీజేపీపై పెరియార్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.