జయలలిత కూతురినని  పిటిషన్‌.. సుప్రీం కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

జయలలిత కూతురినని  పిటిషన్‌.. సుప్రీం కన్నెర్ర

November 27, 2017

తాను జయలలిత బిడ్డనని చెప్పిన బెంగళూరు యువతి అమృత సుప్రీం కోర్టు గడప తొక్కింది.  కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించండి అని పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు భగ్గుమంది. ‘ఇది ఇప్పటికిప్పుడు తేల్చాల్సిన సమస్య అని అనుకుంటున్నారా? మీరు ముందు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా మా వద్దకు ఎందుకొచ్చారు? ’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమృత తరఫున సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదిస్తుండటంతో ఈ కేసు  ప్రాధాన్యతను సంతరించుకున్నది.  తాను పుట్టగానే జయ తనను బంధువులకు అప్పగించిందని అమృత తెలిపింది. వారి ద్వారా డిసెంబర్ 5న జయలలిత మృతి చెందిన తరువాత ఈ  విషయం తెలిసిందని పిటిషన్లో వెల్లడించింది.  

జయలలిత మరణం తరువాత ఇలాంటివి రాజకీయంగా, వ్యక్తిగతంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను జయకు, శోభన్ బాబుకు పుట్టానని ఒక వ్యక్తి గతంలో ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశాడు.