ఇక పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ - MicTv.in - Telugu News
mictv telugu

ఇక పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ

March 20, 2018

ఇకపై పెట్రోలు, డీజిల్‌ను ఇంటి వద్దే అందిస్తామని ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇకనుండి డోర్ డెలివరీలో పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారులు పొందనున్నారు. పెట్రోలు బంకులకు దూరంగా ఉండే ప్రాంతాలతో పాటు గ్రామాలకు ఈ నూతన సేవలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. ఇంటి వద్దే ఇంధనాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తన అధికారిక ట్విట్టర్‌లో తెలిపింది. ఈ వినూత్న ఆలోచనలోని విధివిధానాలు, మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఎలాంటి సేవా ఛార్జీలు లేకుండా సాధారణ ధరకే పెట్రోల్ ఇస్తారా? లేకపోతే వసూలు చేస్తారా ? డెలివరీ చార్జ్ ఎంతుంటుంది? ఎప్పటి నుంచి ఈ సర్వీస్ మొదలవుతుందనేది తెలియాల్సి వుంది.ఎన్ని పెట్రోల్ బంకులు వున్నప్పటికీ చాలా మంది ఇంధనానికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనికోసం ప్రత్యేక యాప్ ఏమైనా ఏర్పాటు చేస్తుండొచ్చని అనుకుంటున్నారు.