mictv telugu

మళ్లీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

January 15, 2019

గతంలో భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలో మధ్యలో కొన్ని రోజులు తగ్గుముఖం పట్టాయి. కానీ తాజా సమాచారం ప్రకారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

Telugu news petrol and diesel price are hiking again .

కొత్త సంవత్సరం ప్రారంభమైన పదిహేను రోజుల్లోనే ఆరు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. చమురు సంస్థలు సోమవారం పెట్రోల్‌పై 40 పైసలు, డీజిల్‌పై 53 పైసలు పెంచాయి. వరుసగా ఐదో రోజూ ఇంధన ధరలు పెరగడంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.70.13, డీజిల్‌ రూ.64.18కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.74.40, డీజిల్‌ రూ.69.77కి చేరింది. జనవరి 10 నుంచి ప్రతి రోజూ ఇంధన ధరలు పెరుగుతుండగా, తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.56, డీజిల్‌పై రూ. 2.20 చొప్పున పెరిగింది.

Telugu news petrol and diesel price are hiking again