ఫోన్ బ్యాటరీ పేలి..  - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్ బ్యాటరీ పేలి.. 

September 6, 2017

ఉత్తర ప్రదేశ్ లోని సైనా అనే వూళ్లో పన్నెండేళ్ళ అరవింద్ అనే పిల్లాడి చేతిలో ముబైల్ బ్యాటరీ పేలింది. ఈ దుర్ఘటనలో ఆ బాబు చేయి వేలు ఒకటి పూర్తిగా తెగిపోయింది. శరీరానికి చాలా చోట్ల గాయాలయ్యాయి. అసలా బ్యాటరీ ఎలా పేలిందంటే..

అరవింద్ నాన్న తన దగ్గరున్న చైనా ఫోన్ ను కొడుక్కిచ్చి ఛార్జింగ్ పెట్టమని బయటికెళ్ళాడు. అరవింద్ ఆ ఫోన్ నుండి బ్యాటరీని వేరు చేశాడు. దానికి డైరెక్టుగా సాకెట్ లోంచి రెండు వైర్లు తీస్కొని బ్యాటరీకి పెట్టాడు. అంతే ఢాం అని పేలింది బ్యాటరీ. ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ అతని చేతిలోనే వుండటం వల్ల చేతి వేలు తెగి ఎక్కడో పడిపోయింది. బయట ఏదో పని చేసుకుంటున్న తండ్రి ఆ సౌండు విని లోపలికి పరుగెత్తుకెళ్ళే సరికి కొడుకు ఒళ్ళంతా తీవ్ర గాయాల పాలై కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు.  వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రాణాలకు ఎటువంటి నష్టం వాటిల్లకున్నా వేలు పోయింది. పేలినప్పుడు బ్యాటరీ భాగాలు చాలా ఫోర్సుగా అతని బాడీలోకి దిగబడ్డాయి.. డాక్టర్లు వాటిని సర్జరీలు చేసి తొలగిస్తున్నారు.

 చూశారా..  పిల్లలను ఎప్పుడూ పెద్దవాళ్ళు ఓకంట కని పెట్టుకొని వుండాలంటారు ఇందుకోసమే. పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. సో.. పెద్దవాళ్ళెప్పుడూ వాళ్ళను కనిపెట్టుకొనే వుండాలి. ముఖ్యంగా ఈ ఫోన్లకు వాళ్ళను దూరంగా పెట్టడం చాలా ఉత్తమం.