కాపురంలో చిచ్చుపెట్టిన సినిమా నంబర్ - MicTv.in - Telugu News
mictv telugu

కాపురంలో చిచ్చుపెట్టిన సినిమా నంబర్

November 1, 2017

సినిమాల్లో వాడే ఫోన్ నంబర్లకు, బయట సాధారణ వ్యక్తులు బలి అవుతున్నారు. మొన్న వచ్చిన ‘రాజాదిగ్రేట్’ సినిమాలో కూడా ఇదే జరిగింది. ఓ సందర్భంలో రవితేజ విలన్‌కు ఫోన్ నంబర్ చెబుతాడు. ఆ ఫోన్ నంబర్ విశాఖ జిల్లావాసిది కావడంతో  సినిమా విడుదలయ్యాక..‘హలో రవితేజ గారండీ’ అని అతనికి  కొన్ని వందల ఫోన్స్ వచ్చాయి. ఫోన్ల తాకిడి తట్టుకోలేక అతను ఫోన్ ను స్విఛ్చాఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తాజాగా ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్‌లో జరిగింది. ‘రాజ్నీతి’ అనే బంగ్లాదేశ్ సినిమాలో ఓ ఆటో డ్రైవర్ ఫోన్ వాడారు. ఆ సినిమాలో అది హీరోగారి నంబర్. అంతే  ప్రతిరోజు ఐ లవ్యూ హీరో అని చాలామంది అమ్మాయిలు ఫోన్ చేశారు.  నిజంగా డ్రైవర్ కోసమే అమ్మాయిలు ఫోన్ చేస్తున్నారనే అనుమానంతో, అతని భార్య విడాకులు కోరింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ ‘రాజ్ నీతి’లో తన ఫోన్ నంబర్ వాడినందుకు  ఆ సినిమా నిర్మాత, నటుడు షాకిబ్ ఖాన్‌పై రూ. 40 లక్షల దావా కోర్టులో దావా వేశాడు. విచారణ చేపట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.  సినిమా అనేది లక్షలు కోట్ల మందికి  చేరువయ్యే అంశం. మరి అలాంటి సినిమాల్లో ఎవరి ఫోన్ నెంబర్ వాడుతున్నామో,ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సిన బాధ్యత  సినిమావాళ్లపై ఎంతైన ఉందంటున్నారు బాధితులు.