కవిత ట్విటర్లో మెరిసిన అద్భుత చిత్రం! - MicTv.in - Telugu News
mictv telugu

కవిత ట్విటర్లో మెరిసిన అద్భుత చిత్రం!

March 8, 2018

ఆహా ఈ ఫోటోను చూస్తుంటే కోట్లు పెట్టినా కొనలేని ఏదో తెలియని ఆనందం కలుగక మానదు. తల్లీ కూతుర్ల చిరునవ్వు చూస్తుంటే భవిష్యత్తుపై భరోసా, ఎప్పుడూ లేని ఆత్మస్థైర్యం మన సొంతమవుతుంది. బిడ్డ తలపై టోపీ పెట్టి ఆ చిట్టితల్లి బంగారు భవిష్యత్తు గురించి ఆ తల్లి ఎంతగా ఆరాట పడుతుందో ఆమె చిరునవ్వే చెబుతోంది. నా బిడ్డ ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతుంది అనే ధీమా ఆ తల్లి కళ్లలో కనబడుతుంది.

అందుకేనేమో  నిజామాబాద్ ఎంపీ కవిత మనసు దోచుకుంది ఈ ఫోటో. పిక్ ఆఫ్ ది డే అంటూ కవిత తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ చిత్రం ‘తల్లి ప్రేమ గురించి మనకు తెలియని ఎన్నో లక్షల అనుభూతులను కలిగిస్తోంది. అంతేకాదు బిడ్డ బంగారు భవిష్యత్తుకోసం ఓ తల్లి ఎల్లప్పుడు ఎంతలా ఆరాట పడుతుందో కూడా తెలియజేస్తుంది’ అని కవిత చెప్పారు.

మహిళా దినోత్సవం’ సందర్భంగా కవిత మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, మహిళా దినోత్సం అంటే ఈ ఒక్కరోజే కాదు ప్రతి రోజు జరుపుకోవాలని సూచించింది. షీ టీమ్స్ వల్ల మహిళలు చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారని ఆమె అన్నారు.