పాస్టిక్ బాటిళ్లతో  మరుగు దొడ్డి...ఐడియా అదుర్స్ ! - MicTv.in - Telugu News
mictv telugu

పాస్టిక్ బాటిళ్లతో  మరుగు దొడ్డి…ఐడియా అదుర్స్ !

March 12, 2018

పశ్చిమ బెంగాల్‌లో ఉండే అశోక్  అనే వ్యక్తి తన ఇంటివద్ద టాయ్’లెట్ నిర్మించాలనుకున్నాడు. కానీ అతని దగ్గర  అది నిర్మించేందుకు సరిపడా డబ్బులేదు. అయితే డబ్బులేదని అతను ఊరికే కూర్చోలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతికాడు. అప్పుడు అతనికి సూపర్ ఐడియా తట్టింది.  అసలు ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను ఎందుకు పాడేయాలి? వాటిని తన మరుగుదొడ్డి కట్టడానికి ఉపయోగించుకోవచ్చుగా అని ఆలోచించి, తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు.ప్లాస్టిక్ బాటిళ్లలో మట్టిని నింపుతూ  వాటినే ఇటుకలుగా పేరుస్తూ..సిమెంట్ మట్టితో వాటిని అతికిస్తూ వచ్చాడు.  ఇంకే టాయ్‌లెట్‌కు కావలసిన గోడలు రెడీ అయ్యాయి. చూడడానికి కూడా చాలా అందంగా తయారయ్యింది  ఆ టాయిలెట్. అశోక్ నిర్మించిన టాయిలెట్ కు అందరూ ఫిదా అయ్యారు. మా దగ్గర కూడా ఇలాంటివి నిర్మించాలని  వాళ్లు అశోక్‌ను కోరారు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చుతుంది అనే దానికి అశోకే నిదర్శనం. అంతేకాదు ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి  హాని చేస్తాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే వాటిని ఇలా ఉపయోగిస్తే మనకు ఉపయోగపడడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. నిజంగా అశోక్ ఐడియా సూపర్ కదా.