పోర్న్ చూసీ చూసీ..నా భర్త నరకం చూపిస్తున్నాడు! - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్ చూసీ చూసీ..నా భర్త నరకం చూపిస్తున్నాడు!

February 16, 2018

మనదేశంలో పోర్న్ సైట్లను పూర్తిగా నిషేదించండి అని ముంబయికి చెందిన ఓ మహిళ సుప్రీంకోర్ట్‌లో కేసు వేసింది. ‘నా భర్త గత  కొన్నేండ్లుగా పోర్నోగ్రఫికి  బానిస అయ్యాడు. పెళ్లైన తర్వాత చాలాసార్లు నాకు ఇష్టంలేకున్నా అసహజ, అనైతిక లైంగిక కార్యకలాపాలలో పాల్గొనాల్సిందిగా నాపై ఒత్తిడి తెచ్చాడు. అస్తమానం సెక్స్ యావలో ఉండి చెయ్యాల్సిన ఉద్యోగం కూడా మానేశాడు. నాకు రోజు ప్రత్యక్ష నరకం కూడా చూపించాడు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 

అంతేకాదు ‘ మా సంసార జీవితం పూర్తిగా నాశనమైపోయిందని అందుకే  ఇద్దరం పరస్పర అంగీకారంతో విడాకులకోసం ఫ్యామిలీ కోర్టుకు కూడా వెళ్లాం, పోర్న్ సైట్ల వల్ల మా జీవితమే నాశనం అయిపోయింది’ అని చెప్పింది. మారుతున్న టెక్నాలజీతో పాటు ఇప్పుడు ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు..విచ్చల విడిగా తయారైన పోర్న్ సైట్లు…వీటితో నేటి యువత తప్పుదోవ పడుతున్నారు, పోర్న్ సైట్లకు బానిసై విలువలను మరచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల దేశ పురోగతి కుంటుపడుతోందని ఆమె కోర్టుకు విన్న వించుకుంది.

అయితే ఆమె చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్ట్ స్పందిస్తూ ‘బహిరంగ ప్రదేశాలలో పోర్న్ చిత్రాలను చూడటాన్ని నిషేదించగల అవకాశాలను పరిశీలిస్తామని చెప్పింది. అంతేకాదు పోర్న్ సైట్లను చూడడం నేరంగా పరిగణించవచ్చా అని  సుప్రీంకోర్ట్ కేంద్రంను అభిప్రాయం అడుగగా చిన్నపిల్లల పోర్నోగ్రఫిని నిషేదించేందుకు సహకరిస్తామని..అంతేకాని పూర్తిగా పోర్న్ సైట్లను నిషేదించడం  యుక్తవయసులో ఉన్నవారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

పోర్న్ అయినా, ఇంకేదైనా  హద్దులకు మించి మితిమీరి పోతే లేనిపోని అనర్థాలు జరుగుతాయి, అపార్థాలు పెరుగుతాయనేది  నగ్న నిజం.