మోదీ.. మరీ ఇంత దిగజారిపోయావా? : శివసేన - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ.. మరీ ఇంత దిగజారిపోయావా? : శివసేన

December 12, 2017

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని అత్యంత అధమ స్థాయికి దిగజార్చాడాని బీజేపీ  మిత్రపక్షం శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ అభివృద్దిని ప్రస్తావించడానికి బదులుగా, మొగల్ రాజుల సమాధులను తవ్యుతున్నారని విమర్శించింది.

‘ఇలా మాట్లాడబట్టే..  కాంగ్రెస్ పార్టీని గుజరాత్ ప్రజలు 22ఏళ్ల పాటుగా తిరస్కరించారు. ప్రధాని  తన సొంత రాష్ట్రంలో అభివృద్ధి,  సంక్షేమం, ఇతర అంశాలను పక్కన పెట్టాడు. నువ్వెంత? నేనంత అని దిగాజారి మాట్లాడుతున్నాడు’ అని  శివసేన తన అధికార పత్రిక  ‘సామ్నా’ సంపాదకీయంలో  నిప్పులు చెరిగింది.మోదీ ప్రచారంలో ప్రతి దానికి భావోద్వేగానికి  గురి అవుతున్నారని, చాలా దురుసుగా ప్రవర్తిస్లున్నారని ఆక్షేపించింది.  ఇంత దిగజారి ప్రచారం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.  రాజకీయ నిరుద్యోగి మణిశంకర్ అయ్యర్  చేసిన ‘నీచ్’ వ్యాఖ్యలపై  మోదీ అతిగా స్పందించారని విమర్శించింది.

‘అయ్యర్ అన్నది నన్నున కాదు. మొత్తం గుజరాత్ ప్రజలను అమానించాడు.. అని  మోదీ అనడం దారుణంగా ఉంది. అయ్యర్ గుజరాతీలను విమర్శించలేదు. కేవలం మోదీని మాత్రమే విమర్శించాడు.. దీనికి మసిపూయడం మంచిది కాదు.. ’ అని సేన తప్పు పట్టింది.

 మోదీ జాతీయ నాయకుడిలా కాకుండా గల్లీ నాయకుడిగా తనను  భావించుకుంటున్నారని విమర్శించింది. ఆయన ప్రజలందరి గౌరవ ప్రతిష్టల కోసం, హిందూ దేశ ప్రతిష్ట కోసం నిలబడాలని కోరుకుంటున్నామని, . కానీ ఆయన ఇంకా గుజరాతీ అన్న భావనతోనే  ఉన్నారని పేర్కొంది. ‘ఎవరైనా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే, జాతీయవాదం అనే కత్తి వారి గొంతులను కోస్తోంది.. ’ అని ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటుందన్న ప్రధాని వ్యాఖ్యలను సైతం శివసేన తప్పుబట్టింది. గుజరాత్ ఎన్నికల ప్రచారం భావోద్వేగ ప్రసంగాలు, కన్నీళ్లు, శివతాండవాలతో అత్యంత నాటకీయంగా మారిందని విమర్శించింది.