మెట్రో హెల్ప్లైన్ నంబర్ ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో హెల్ప్లైన్ నంబర్ ఇదే..

November 28, 2017

హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రో రైలును  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు 2:15 నిమిషాలకు   ప్రారంభించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి రానునుంది. మెట్రో రైలుకు సంబంధించి ప్రయాణాలు, టికెట్లు, పార్కింగ్, ఇతర సమస్యలకు పరిష్కారం, వివరణలు

తెలుసుకోవడానికి  040-27772999 నెంబర్‌కు కాల్ చేయాలని హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి సమస్యలూ  తలెత్తకుండా హెచ్ఎంఆర్ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల సమస్యల  పరిష్కారానికి ఈ హెల్ప్‌లైన్ బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది.