కవి ఆర్. సీతారాంకు కాళోజీ పురుస్కారం - MicTv.in - Telugu News
mictv telugu

కవి ఆర్. సీతారాంకు కాళోజీ పురుస్కారం

September 9, 2017

ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 103 వ జయంతి ఉత్సవాలు దవీంద్ర భారతి వేదికగా చాలా ఘనంగా జరుగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఆర్. సీతారాంకు కాళోజీ అవార్డు ప్రధానం జరిగింది. ముఖ్య అతిథులుగా హోం మినిస్టర్ నాయని నర్సింహా రెడ్డి, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, రాష్ట్ర సాహిత్య అకాడమి ఛైర్మెన్ నందిని సిధారెడ్డి, భాజాపా నేత భండారు దత్తాత్రేయ, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఆచార్య ఎస్. వి. సత్యనారాయణలు పాల్గొన్నారు. వారి వారి ప్రసంగాల్లో కాళోజీ తెలంగాణ సమాజానికి చేసిన సేవలను గుర్తు చేస్కున్నారు.

‘ రక్త స్పర్శ ’ కవితా సంపుటితో సాహితీ లోకానికి పరిచయమయ్యారు ఆర్. సీతారాం. ఆ తర్వాత వెలువరించిన ‘ ఇదిగో ఇప్పటిదాకా ’ కవితా సంపుటి సంచలనాలు సృష్టించింది. అలాగే ‘ ఆధునిక కవితా ధోరణులు ’ అనే అంశంపై పరిశోధనలు చేశారు. ‘ చెకుముకిరాయి ’ కవితా సంపుటి కూడా ఆర్. సీతారాంను ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సీతారాంలోని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన కాళోజీ మాదిరిగానే అతి సామాన్య జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు. ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చెయ్యటం పట్ల కవి ఆర్. సీతారాం తన ఆనందాన్ని వ్యక్తం చేసారు.