పిచ్చివాడిపై పోలీసుల ప్రతాపం.. ఖాకీలు మారరా? - MicTv.in - Telugu News
mictv telugu

పిచ్చివాడిపై పోలీసుల ప్రతాపం.. ఖాకీలు మారరా?

February 15, 2018

ఒంటిపైన  పోలీస్ డ్రెస్ ఉంటే చాలు  ఎక్కడాలేని అధికారం మదం ఆవహిస్తుంది కొంతమంది పోలీసులకు. జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో కూడా కొందరు పోలీసులు  ఒంటిపైన ఖాకీ  చొక్కా ఉందని  మానవత్వం మరిచిపోయి  మూర్ఖుల్లా ప్రవర్తించారు.  మతిస్థిమితంలేని వ్యక్తి  రోడ్డుపై  కూర్చున్నాడు.  అప్పుడే  అటువైపు  పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వచ్చి  అతన్ని  బూతులు తిట్టుకుంటూ కర్రలతో  అమానుషంగా కొట్టారు.

ఆ తర్వాత అతన్ని  అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కొందరు ఈఘటనను  వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ కావడంతో.. ఈవిషయంపై  పోలీసులను అడుగగా  అతన్ని రోడ్డు పక్కకు తీసుకెళ్లేందుకే  మేం అలా ప్రవర్తించామని  చెప్పుకొచ్చారు. అయితే  పోలీసుల తీరుపై చాలా మంది  మండిపడుతున్నారు.  ఓ మతిస్థిమితం లేని వ్యక్తిపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని  వాళ్లను తిడుతున్నారు.