హైపర్ ఆదిపై పోలీసులకు అనాథల ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

హైపర్ ఆదిపై పోలీసులకు అనాథల ఫిర్యాదు

November 25, 2017

ఈటీవీలో వస్తున్న‘జబర్దస్త్’ కామెడీ షోలో మొన్న గురువారం హైపర్ ఆది ‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే  మగాడికి కలిగే సంతానమే అనాథలు’ అని అనాథలను కించపరుస్తూ, వారి తల్లిదండ్రులను అవమానిస్తూ  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పలు మహిళా సంఘాలు, పలు అనాథాశ్రమాలు ఆ కామెడీ షోపై,హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. అనాథాశ్రమంలో ఉన్న చాలామంది పిల్లలు మనస్తాపానికి  గురయ్యారని నిర్వాహకులు చెబుతున్నారు.‘ప్రమాదాల్లో, ప్రకృతి విపత్తుల్లో, ఆర్థిక సమస్యల వల్ల.. వేరువేరు కారణాల వల్ల తల్లిదండ్రులను పొగొట్టుకున్న వారు కూడా అనాథలే. మరి హైపర్ ఆది వ్యాఖ్యలతో అలాంటి పిల్లలు తీవ్ర మనస్తానికి గురయ్యారు, తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోక బ్రతుకుతున్న పిల్లలపై ఇంత నీచంగా డైలాగులు వేయడం సరికాదు.  వెంటనే ‘జబర్దస్త్’ షోపై, హైపర్ ఆదిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

విలువలను మరిచి బూతు హాస్యంతో మానవ సంబంధాలపై  పంచులు వేస్తూ  దిగజారుతున్న  ఇలాంటి వారిని జైళ్లో పెట్టాలి’ అని వరంగల్ లోని  ‘మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమం’లో ఉన్న నిర్వాహకులు, అనాథ పిల్లలు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘అమన్ యువ ఆర్గనైజేషన్’ వాళ్లుకూడా బాలల హక్కులను ఉల్లఘించినందుకు  హైపర్ ఆదిపై ముషీరాబాద్‌లో పోలీస్టేషన్లో  ఫిర్యాదు చేశారు.