హోంగార్డ్‌పై కానిస్టేబుల్ అత్యాచారం

కంచే చేనును మేయడం అంటే ఇదేనేమో… ప్రజలను నేరస్తుల నుంచి కాపాడాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతూ సాధారణ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక సంఘటనే ఇందుకు నిదర్శనం. ఒక మహిళా హోంగార్డ్‌ను కానిస్టేబుల్ అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. జనభారతి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ళ చంద్రశేఖర్ బెంగుళూరు యూనివర్సిటీ దగ్గర డ్యూటీ చేస్తున్న మహిళా హోంగార్డ్‌ని తరచూ డబల్ మీనింగ్ మాటలతో వేధిస్తుండేవాడు.Telugu News Police conistable raped women home guard in bengaluruదీనితో విసుగు చెందిన సదరు మహిళా హోంగార్డ్ పోలీస్ ఉన్నతాధికారికి పిర్యాదు చేయడంతో చంద్రశేఖర్‌ను మందలించాడు ఉన్నతాధికారి. దీనితో ఆగ్రహించిన చంద్రశేఖర్ ఆరోజు రాత్రి హోంగార్డ్ ఇంటికి వెళ్లి ఆమె ఒంటరిగా ఉండడం గమనించి అత్యాచారం చేశాడు. తరువాత ఒక బకెట్ నీళ్లు ఆమె మీద పోసి ఆధారాలు చెరిపేసే ప్రయత్నం చేశాడు. ఆ మహిళా భర్త రాత్రి వచ్చిన తరువాత భార్యను చూసి నివ్వెరపోయాడు. దంపతులు ఇద్దరూ కలిసి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చంద్రశేఖర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.