వీడో పోలీస్..విడాకులకోసం భార్యకు లంచం ఆఫర్! - MicTv.in - Telugu News
mictv telugu

వీడో పోలీస్..విడాకులకోసం భార్యకు లంచం ఆఫర్!

February 22, 2018

నెత్తిమీద టోపీ, చేతిలో లాఠీ పట్టుకుని చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ బుద్ది తక్కువ పని చేశాడు. 25 ఏళ్లు కాపురం చేసిన భార్యకు విడాకులకోసం లంచం ఇవ్వాలని చూశాడు. కృష్ణా జిల్లా  గొల్లగూడెం గ్రామానికి చెందిన డీసీపీ బాబురావ్‌కు 4గురు పిల్లలు ఉన్నారు. అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యను హింసించడం మొదలు పెట్టాడు. 5 లక్షలు ఇస్తాను విడాకులు ఇవ్వు అని  భార్యపై ఒత్తిడి పెంచాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేక ఆ భార్య డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.‘నాతో 25 ఏళ్లు కాపురం చేసిన నా భర్త  నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు. మతం మార్చుకుని  వేరెకరితో సహజీవనం చేస్తున్నాడు. నా భర్తకు చాలామందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి.  ఇదేంటని నిలదీస్తే 5 లక్షలు ఇస్తాను విడాకులు ఇవ్వు అని నాపై ఒత్తిడి తెస్తున్నాడు. నా నలుగురి పిల్లలకు, నాకు న్యాయం చేయండి. నాభర్తపై కఠిన చర్యలు తీసుకోండి ’ అని అతని భార్య వేదశ్రీ  డీజీపీకి  ఫిర్యాదు చేసింది.