ఈ పోలీసోడు ఏం చేసిండో చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పోలీసోడు ఏం చేసిండో చూడండి!

August 26, 2017

రౌడీల దందాలు.. పోలీసు దందాలు.. మనకు తెలుసు. వ్యాపారుల దగ్గర్నుంచో,  కాంట్రాక్టర్ల దగ్గర్నంచో వీళ్లు మామూళ్లు వసూలు చేస్తుంటారు.  జమ్మూ కశ్మీర్లో రాంబాన్  లో హైడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న  మునావర్ హుస్సేన్ కు ఈ దందా కళ బాగా వొంటబట్టింది. రోడ్డు పక్కన బిచ్చమెత్తుకుంటన్న ఓ యాచకురాలి  వద్ద కూడా ఈ కళ ప్రదర్శించాడు ఇతగాడు.

మొదట ఆ అభాగ్యురాలని బెదరించాడు. చిల్లరకాదు, నోట్లు కావాలని డిమాండ్ చేశారు. నా దగ్గర డబ్బుల్లేవని ఆమె కాళ్లు పట్టుకుని మొత్తుకుంది. అయినా రాక్షస భటుడు కనికనిరించలేదు. పాపం.. ఆమె చేసేదేం లేక అడుక్కున్న నోట్లను చూసింది. మునావర్ జబర్దస్త్ గా వాటిని లాక్కుని జేబులో వేసుకున్నాడు. ఈ మొత్తం సీన్ ను ఎవరో వీడియోలో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్తా పాకిపోవడంతో పోలీసు అధికారులు ఈ పోలీసు గూండాను అరెస్ట్ చేసి, విధుల నుంచి సస్పెండ్ చేశారు.  మునావర్ తాగుబోతు అని, వ్యవసనాలకు లోనై జనం వద్ద దందాలకు దిగుడుతున్నాడని చెప్పారు. గతంలో అతనిపై మూడు కేసులున్నాయట.