దొంగపోలీస్ కు కటకటాలు  - MicTv.in - Telugu News
mictv telugu

దొంగపోలీస్ కు కటకటాలు 

September 11, 2017

బతకటానికి వంద దారులు, మోసం చెయ్యటానికి వెయ్యి దారులన్నట్టే వుంది ఈయన తర్వాయి చూస్తుంటే. పోలీస్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మంథని టీఆర్‌ఎస్‌ ఎంపీపీ కుమారుడు శ్రీధర్‌గౌడ్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగలాగ మారితే ఎప్పటికైనా దొరికే అవకావముందని గౌడ్ అనుకున్నాడు. దీంతో దొంగల్ని పట్టుకునే పోలీస్ అవతారం ఎత్తి దోచుకుంటే ఎలా వుంటుందని

పక్కా ప్లానేసిండు. కనీ అడ్డంగా బుక్కైపోయిండు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేసి  కుచ్చుటోపీ పెట్టాడు. గోదావరిఖనిలో క్రైం బ్రాంచ్‌ డీఎస్పీగా చెప్పుకుంటూ ఓ బార్‌ యజమానిపై దౌర్జాన్యానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌లో శ్రీధర్‌గౌడ్‌పై కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అదే తరహా మోసానికి పాల్పడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వేషం వేసిన అయ్యవారిప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.