13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్..

December 7, 2018

 తెలంగాణలో 13 సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. వీటిలో 5 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.

Telugu news polling in 13 sensitive assembly constituencies in Telangana at 4’o clock.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 13 స్థానాల్లో నిబంధనల ప్రకారం 4 గంటలకే బూత్‌లను మూసేశారు. 4 గంటల్లోపు బూతులకు చేరుకున్నవారిని ఓటేసేందుకు అనుమతిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు, ఖమ్మం జిల్లాలో ఐదు, వరంగల్ జిల్లాలో రెండు, కరీంనగర్ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని సమస్యాత్మక స్థానాలుగా గుర్తించడం తెలిసిందే. వీటిలో సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసీఫాబాద్, భూపాలపల్లి, ములుగు,  పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, మంథని ఉన్నాయి.

Telugu news polling in 13 sensitive assembly constituencies in Telangana at 4’o clock