13 నియోజకవర్గాల్లో 4 వరకే పోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

13 నియోజకవర్గాల్లో 4 వరకే పోలింగ్

December 6, 2018

తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.  రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. భద్రతాబలగాలు కూడా అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే 13 నియోజకవర్గాలను గుర్తించారు. బెల్లంపల్లి, సిర్పూర్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, మంథని, పినపాక, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, మంచిర్యాలలో  పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.Telugu News polling up to 4 O’clock in these problematic constanciesఎన్నికలను బహిష్కరించండి..  మావోయిస్టులు

మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రంలో పోలింగ్‌ సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేసి వెళ్లే విధంగా భద్రత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి మావోయిస్టు కేడర్‌ ప్రవేశించకుండా సరిహద్దు జిల్లాల్లో నిఘా కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఉద్రిక్త సంఘటనలు జరుగకుండా నాలుగు వేలమంది పోలీసులతో, సమస్యాత్మక కేంద్రాల వద్ద కేంద్ర బలగాల పహారా ఉంటుందని చెప్పారు.