పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలి.. కేంద్రానికి మధ్యప్రదేశ్ హోంమంత్రి లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలి.. కేంద్రానికి మధ్యప్రదేశ్ హోంమంత్రి లేఖ

April 24, 2018

పోర్న్ వెబ్‌సైట్ల వల్లే సమాజంలో చాలా అకృత్యాలు పెరుగుతున్నాయని.. వాటిని బ్యాన్ చేయాలని ఎప్పటినుంచో మహిళా సంఘాలు ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు తలుచుకుంటేనే వాటి నిష్క్రమణ సాధ్యమవుతుందనేది వాస్తవం. ఆ దిశగా మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ స్పందించారు. పోర్న్‌ను ఈ దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.‘ ఆయా శృంగార వెబ్‌సైట్లలో అసహజ శృంగారం ఎక్కువగా చూపిస్తున్నారు. వాటిని చూసి ప్రభావితులవుతున్నారు యువత. వాటివల్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మా అధ్యయనంలో బయట పడింది. ముందుగా 25 వెబ్‌సైట్లపై నిషేధం విధించాము. సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న లైంగిక నేరాలను తగ్గించేందుకు వీలుగా పోర్న్ వెబ్‌సైట్లను వెంటనే నిషేధించాలి ’ అని లేఖలో పేర్కొన్నారు మంత్రి.

పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే రేపిస్టులను ఉరి తీయాలని తాము గత ఏడాది నవంబరులోనే బిల్లును ఆమోదించామని మంత్రి చెప్పారు.  బాలికలపై అత్యాచారాలు చేసే రేపిస్టులకు సమాజంలో జీవించే హక్కు లేదని.. వారిని ఉరి తీయాల్సిందేనని మంత్రి భూపేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పోర్న్ సైట్ల వల్ల టీనేజర్లలో లైంగిక నేరాలు పెరగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  తమ రాష్ట్రం చేసిన తీర్మానం మేర కేంద్రసర్కారు బాలికలపై అఘాయిత్యాలు చేసిన రేపిస్టులను ఉరి తీయాలని చేసిన చట్టసవరణ తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి భూపేంద్రసింగ్ తెలిపారు.