మీబిజినెస్ కోసం ఎవరెవరికో పెళ్లి చేస్తున్నారు కదరా? - MicTv.in - Telugu News
mictv telugu

మీబిజినెస్ కోసం ఎవరెవరికో పెళ్లి చేస్తున్నారు కదరా?

December 17, 2017

అరరే వారం రోజుల నుంచి ఒకటే న్యూస్. ప్రభాస్ తో నిహారిక పెళ్లి, నిహారికతో ప్రభాస్ పెళ్లి అని తెలిసిన అనుష్క ఏం చేసిందో తెలుసా?ప్రభాస్ ,నిహారిక పెళ్లి గురించి చిరంజీవి ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు? ప్రభాస్ ,నిహారిక పెళ్లి గురించి పవన్ కామెంట్?

ప్రభాస్, నిహారిక పెళ్లి తేల్చేసిన కృష్ణం రాజు. ఏందిరా ఈ హెడ్డింగులు,ఓ హద్దు పద్దూ లేదేంట్రా? మీ బిజినెస్ కోసం ఎవరకి..ఎవరితోనైనా ముడిపెట్టి పెళ్లి చేసేస్తారారా? గుస గుసలు వినిపిస్తున్నాయి, చేస్తున్నట్టు తెలుస్తోంది, అనుష్క ఆగమయ్యింది. ఏందిరా ఇది.

వాళ్లేదో సంబంధం మాట్లాడుకుంటున్నప్పుడు పక్కనే ఉండి విన్నట్టు అంత ఖచ్చితంగా హెడ్డింగులు పెడుతున్నారేంట్రా? ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే ఈపెళ్లి మీద వచ్చిన గాసిప్పు వార్తలన్నీ  ప్రస్తుతం య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. మరి అందులో నిజమెంతో క్లారిటీ ఇవ్వండ్రా? హెడ్డింగ్ పక్కాగా పెట్టి  తీరా ఓపెన్ చేస్తే పురాణం చెబుతారేంట్రా…మీ బిజినెస్ స్టాటజీ తగలెయ్య?  అని తిట్టుకుంటున్నారు. ఈ హెడ్డింగులు చదివి వీడియో ఓపెన్ చేసిన వాళ్లు.