ప్రభుదేవా... మూకీ మూవీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుదేవా… మూకీ మూవీ

February 16, 2018

ప్రభుదేవా మరో వినూత్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అటు దర్శకత్వం ఇటు నటన.. మరో వైపు కొరియోగ్రఫీ.. అయినా అన్నింటికీ న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాడు ప్రభుదేవా.  ‘ పిజ్జా ’ సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, ప్రభుదేవా కలయికలో వస్తున్న తాజా సినిమా ‘ మెర్క్యురీ ’. ఈ  సినిమాలో మాటలుండవు. మూకీ సినిమాగా రూపొందుతోంది. పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌బెంచ్‌ ఫిల్స్మ్‌ పతాకంపై కార్తికేయన్ సంతానం నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.అప్పట్లో సింగీతం శ్రీనివాసరావు.. కలల్ హాసన్, అమలలతో  తీసిన ‘ పుష్పక విమానం’ మాదిరి ఈ సినిమా నిర్మితమవుతోంది. డాన్సర్‌గా, కథానాయకుడిగా, దర్శకుడిగా మెప్పించిన ప్రభుదేవా ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి.