ప్రభాస్, రానా  ప్రమాదకరం

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో పొరపాటున ప్రభాస్, రాణా, ప్రభుల పేర్లు కొట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి.. వారి పేర్లు సెర్చ్ చేసినప్పుడు చాలా అప్రమత్తంగా వుండాలని అంటున్నారు సైబర్ నిపుణులు. లేదంటే బోలెడంత వైరస్‌తో సైబర్ దాడి జరగొచ్చని  

ప్రపంచ స్థాయి సైబర్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫే హెచ్చరిస్తోంది. సెలబ్రిటీల పేర్లతో సెర్చ్ ఎంతవరకు సురక్షితం అన్నదానిపై ఏటా మెకాఫే అధ్యయనం చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది సెర్చ్ ఇంజిన్‌లో అత్యంత ప్రమాదకరమైన దక్షిణాది నటుడిగా సీనియర్ నటుడు ప్రభు తొలిస్థానంలో నిలిచాడని మెకాఫే తెలిపింది. ఆ తరువాతి స్థానాల్లో ప్రభాస్, రానా దగ్గుబాటి నిలవడం విశేషం.

అభిమాన హీరోలని సెర్చ్ చేశారంటే వైరస్ చొరబడే ప్రమాదం ఉందని మెకాఫే చెబుతోంది. వీళ్ళను మించి దేశవ్యాప్తంగా చేసిన సెర్చ్‌లో హిందీ టీవీ కమెడియన్ కపిల్ శర్మ తొలి స్థానంలో నిలిచాడు. కపిల్ శర్మ పేరుతో సెర్చ్ ఇంజిన్ లో వెతికితే 9.58 శాతం హానికర వెబ్‌ సైట్స్‌ ఓపెన్ అవుతున్నాయని మెకాఫే వెల్లడించింది. 2016 సర్వేలో బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా మొదటి స్థానంలో నిలవగా, ఆమె స్థానాన్ని ఈ ఏడాది కపిల్ శర్మ ఆక్రమించాడు. అతడి తరువాత సల్మాన్, ఆమీర్ ఖాన్‌లు, 8.5శాతంతో ప్రియాంకా చోప్రా ఉన్నట్లు మెకాఫే తెలిపింది. గతేడాది ఏడోస్థానంలో ఉన్న ప్రియాంక ప్రస్తుతం నాలుగో ర్యాంకులో ఉన్నారు. అభిమానంతో గూగుల్ సెర్చ్‌లోకెళితే అడ్డంగా వైరస్ దాడికి గురవ్వాల్సిందేనని పదే పదే చెప్తున్నారు.

 

 

SHARE