‘ద లార్ట్ ఆఫ్ ద రింగ్స్’ తరహాలో రామాయణం తీస్తా... - MicTv.in - Telugu News
mictv telugu

‘ద లార్ట్ ఆఫ్ ద రింగ్స్’ తరహాలో రామాయణం తీస్తా…

April 3, 2018

ప్రముఖ  కొరియోగ్రాఫర్, దర్శకుడు , నటుడు, ప్రభుదేవా నేడు 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘ నా  డ్రీమ్ ప్రాజెక్ట్ రామాయణం తెరకెక్కించడం. అది కూడా హాలీవుడ్ ‘ద లార్ట్ ఆఫ్ ద రింగ్స్’ సినిమా రేంజ్‌లో తీయాలని ఉంది. అయితే అది ఇప్పుడు కాదని , ఆ సినిమాకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు  బడ్జెట్ అవుతుంది. ఆ తరహా బడ్జెట్ సినిమాలు మనం తీయాలంటే ఇంకో పదేళ్ల సమయం పడుతుంది. అప్పుడు రామాయణాన్ని ఖచ్చితంగా తెరకెక్కిస్తాను. నాకు డ్యాన్స్ ,సినిమాలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. నేను కాళీగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు క్రికెట్‌ చూస్తాను’ అని ప్రభుదేవా  పేర్కొన్నాడు.ప్రస్తుతం ప్రభుదేవా నటించిన ‘మెర్య్కూరీ’, ‘గుళేబకావళి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు సల్మాన్‌‌తో ‘దబాంగ్‌ 3’ సినిమా తీసేందుకు ప్రభుదేవా సన్నాహాలు చేస్తున్నాడు.