ప్రగతి భవన్ ముట్టడి.. బీజేపీ నేతల అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రగతి భవన్ ముట్టడి.. బీజేపీ నేతల అరెస్ట్

March 5, 2018

ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు నిరసన గళం విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీగా ప్రగతి భవన్ వద్దకు చేరుకున్నారు.

బీజేపీ నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ప్రధానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించి బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, బద్దం బాల్‌రెడ్డితో పాటు 100 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలోని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ కార్యాలయం వద్ద కూడా పోలీసులు మోహరించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతలు మాట్లాడుతూ బీజేపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తోందని ఆరోపించారు.