కాకిని జాతీయపక్షిగా ప్రకటించాలి.. ప్రకాశ్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

కాకిని జాతీయపక్షిగా ప్రకటించాలి.. ప్రకాశ్ రాజ్

April 23, 2018

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మరోసారి తీవ్రంగా  విరుచుకుపడ్డాడు. మోదీ సర్కారు, బీజేపీ నేతల తీరుపై ఘాటు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మనదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కనుక ఈ దేశాన్ని హిందూ దేశం అన్న డిమాండ్‌పై చురకలు అంటించారు.‘భారత్‌లో హిందువులు ఎక్కువగా ఉన్నారని హిందూదేశం అనాలని అంటున్నారు. అదెలా సాధ్యం?  ఆ డిమాండ్ సరైందే అయితే కాకిని మన జాతీయ పక్షిగా ప్రకటించండి. ఎందుకంటే మన దేశంలో నెమళ్ల కంటే కాకులే ఎక్కువగా ఉన్నాయి.  కాబట్టి నెమలికి బదులు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించాలి..’ అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. బెంగళూరులో జర్నలిస్టు,సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్‌ను చంపేసిన తర్వాత సంబరాలు చేసుకున్న వారిని ప్రధాని మోదీ ఎందుకు కట్టడి చేయలేదని ప్రకాశ్ రాజ్ మరోసారి నిలదీశాడు. ఈ విషయంలో ఆయన మౌనంగా ఉన్నందుకే తాను విమర్శలు చేస్తున్నానని అన్నారు.