ఆ ఎంపీపై క్రిమినల్ కేసు పెడతా : ప్రకాశ్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఎంపీపై క్రిమినల్ కేసు పెడతా : ప్రకాశ్ రాజ్

November 23, 2017

బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా నటుడు ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘ ప్రకాశ్ రాజ్ కేవలం తన వ్యక్తిగత కారణాల కోసమే ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. అతను తనని తాను పెద్ద నటుడు అనుకుంటున్నాడు. అతణ్ణి చూస్తుంటే లెజెండరీ యాక్టర్స్ ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్‌ల స్థాయిలో ఎగురుతున్నాడు. కానీ తనకంత సీన్ లేదు ’ అని అన్నారు. కాగా ప్రకాశ్ రాజ్ అతని వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ‘ భారత పౌరునిగా ఎంపీ ప్రతాప్ సింహా వ్యాఖ్యలు నా వ్యక్తిగత జీవితం మీద చాలా ప్రభావం చూపాయి.దీనిపై ఆయనకు లీగల్ నోటీసులు పంపుతాను. ఆయన నాకు న్యాయబద్ధంగా సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ కేసు పెడతాను ’ అని హెచ్చరించారు.