రజనీ, కమల్‌‌లకు ఓటెయ్యను.. - MicTv.in - Telugu News
mictv telugu

రజనీ, కమల్‌‌లకు ఓటెయ్యను..

November 1, 2017

నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయ నాయకులను ఎండగడుతుండడం తెలిసిందే. అయితే తాను రాజకీయాల్లోకి రానని చెబుతున్నాడు.

రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కమల్ హాసన్, అడుగు పెడతారని భావిస్తున్న రజనీకాంత్‌ల వ్యవహారంపై ప్రకాశ్ స్పందించారు. రజనీ, కమల్ సినిమాలకు, వారి నటనకు తాను పెద్ద అభిమానిని అని చెప్పారు. అయితే వారు రాజకీయ పార్టీలు స్థాపించి ఎన్నికల బరిలోకి దిగితే  మాత్రం వారికి ఓటు వేయనని స్పష్టం చేశాడు. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నాడు. అయితే మెర్సల్ సినిమా వివాదం వల్ల హీరో విశాల్ ఇంటిపై జరిగిన ఐటీ దాడికి బీజేపీతో ఏం సంబంధంలేదనిః ప్రకాశ్ వ్యాఖ్యనించడం గమనార్హం.