ప్రకాష్ రాజ్ v/s మధుర శ్రీధర్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రకాష్ రాజ్ v/s మధుర శ్రీధర్ రెడ్డి

December 19, 2017

ప్రకాష్ రాజ్ మరోమారు మోడీపై తన వ్యంగ్యాస్త్రం విసిరారు. దానికి కౌంటర్‌గా దర్శక, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తనదైన శైలిలో ట్వీటారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ ప్రియమైనా మోడీజీ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల విజయంపై అభినందనలు మీకు. ఈ ఫలితాలతో మీరు చాలా సంతోషంగా వున్నారో లేదో.. ఒకసారి పునరాలోచించుకోండి. గ్రామీణులు, పేదలు, రైతులను నిర్లక్ష్యం చేస్తే వారి గొంతుక మరింత పెరిగిందని అనిపిస్తోందా ? పాకిస్తాన్, కులాలు, మతాల కన్నా ఈ దేశంలో చాలా పెద్ద సమస్యలున్నాయి ’ అంటూ స్పందించారు ప్రకాష్ రాజ్.వెంటనే దానికి కౌంటర్‌గా మధుర శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ.. ‘ ప్రకాష్ రాజ్.. నీ అహంకారంతో ఎంతోమంది దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెడుతుంటావు కదా.. నీ గోలేంటో అర్థం కావటం లేదు. పబ్లిసిటీ కోసం బాగా పాకులాడుతున్నట్టే వుంది నీ వ్యవహారం చూస్తుంటే. ఓ నాయకుడి మీద ప్రభావం చూపాలంటే అసలు సిసలు కారణం మీద మాట్లాడు. అప్పుడే నీ కామెంట్లను సీరియస్‌గా తీసుకుంటాం ’ అని ట్వీటాడు.