కేసీఆర్‌‌తో ప్రకాశ్‌రాజ్ భేటీ.. ఫ్రంట్‌లో చేరేందుకేనా? - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌‌తో ప్రకాశ్‌రాజ్ భేటీ.. ఫ్రంట్‌లో చేరేందుకేనా?

March 29, 2018

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్  గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.  ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాసేపు ముచ్చటించారు. అసెంబ్లీని పరిశీలించారు. కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడేందుకే ప్రకాశ్‌రాజ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఫ్రంట్ గురించి కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన విషయం తెలిసిందే. జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్‌తో కూడా సమావేశమయ్యారు. త్వరలోనే మరికొంత మంది నేతలను కేసీఆర్ కలిసే అవకాశం వుంది.

ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ కేసీఆర్‌ను కలవటం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. మధ్యాహ్నం కేసీఆర్‌తో కలిసి ప్రగతి భవన్‌లో భోజనం చేశాక ఇద్దరు భేటీ అవుతారు. గౌరీ లంకేశ్ హత్య జరిగినప్పుడు ప్రకాశ్‌రాజ్ మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. జీఎస్టీకి వ్యతిరేకంగా కూడా తన గొంతు వినిపించారు. కాగా ప్రకాశ్‌రాజ్‌ను ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.