ప్రకాష్‌రాజ్ కారు అడ్డుకుని పిడిగుద్దులు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రకాష్‌రాజ్ కారు అడ్డుకుని పిడిగుద్దులు

April 13, 2018

బీజేపీ ప్రభుత్వం నటుడు ప్రకాష్ రాజ్ మీద కక్ష్య గట్టిందా అంటే అవుననే అనొచ్చు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత నెలకొని వుంది. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు, నిరసనలు చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కారును కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని పిడిగుద్దులతో దాడి చేశారు.

గురువారం కర్ణాటకలోని కలుబురిగిలో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రకాష్‌రాజ్ హాజరయ్యారు. అంతకు ముందే ఆయన అక్కడికి వస్తున్నట్టు బీజేపీ కర్యాకర్తలు ప్రచారం చేశారు. అంతే అంబేద్కర్ జయంత్రి జరుగుతున్న ప్రాంతానికి బీజేపీ కార్యకర్తలు వెళ్లారు.

కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్‌కు కారులో బయలు దేరారు. ఇదే అదునుగా భావించి
దారిలో సుమారు 15 మంది బీజేపీ కార్యకర్తలు ప్రకాష్ రాజ్ కారును అడ్డగించారు. కారు ముందు భాగంలో చేతులతో పిడి గుద్దులు గుద్దుతూ  వారంతా మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. ‘ భారత దేశం హిందువులది. కర్ణాటక హిందువులది.. ’ అంటూ పెద్దగా అరిచారు. పోలీసులు జోక్యం చేసుకొని ప్రకాష్ రాజ్‌ను కారు దిగనివ్వకుండా అక్కడినుంచి పంపించి వేశారు.