అంచనాలకు అందని రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ - MicTv.in - Telugu News
mictv telugu

అంచనాలకు అందని రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్

March 28, 2018

‘ రంగస్థలం ’ సినిమా విడుదలకు ముందే మంచి పబ్లిసిటీని మూటగట్టుకుంది. దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అంచనాల్లో వుంది. థియెట్రికల్ హక్కులను పక్కన పెడితే శాటిలైట్ హక్కుల విషయంలో రంగస్థలం ఏ మాత్రం తగ్గలేదట. తెలుగు శాటిలైట్ హక్కులు 20 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10.5 కోట్లు, ఇతర హక్కులను రూ.1.5 కోట్లకు అమ్మినట్టు సమాచారం. థియెట్రికల్ రైట్స్ 80 కోట్లతో కలిపి మొత్తం రూ.112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క తేలినట్టు తెలుస్తోంది.ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 115 కోట్ల మేరకు జరిగినట్టు మీడియాలో కథనాలు వైరల్‌గా మారాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్ మార్కెట్‌లో హవాను కొనసాగించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా హక్కులను రూ.9 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందట.

ఈ సినిమా ఏకంగా 179 నిమిషాల వ్యవధితో అంటే 3 గంటలు ఉంటుందని తెలుస్తోంది. ‘ అర్జున్ రెడ్డి ’ సినిమా మాదిరి ఇది కూడా నిమిషం తక్కువ 3 గంటల నిడివితో రావటవ విశేషం. మరో రెండు రోజుల్లో ఈ లెంగ్తీ సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది. చిత్ర ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా ‘ ఎంత సక్కగున్నావె ’ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే ఆ పాట చాలా మంది ఫోన్‌లలో రింగ్‌టోన్‌గా మారిపోయింది.