నాపైనా లైంగికదాడి జరిగుంటే బాగుండేది.. ప్రీతి జింటా - MicTv.in - Telugu News
mictv telugu

నాపైనా లైంగికదాడి జరిగుంటే బాగుండేది.. ప్రీతి జింటా

November 19, 2018

మీరు చదువుతున్నది అక్షరాలా నిజం… ఈ వ్యాఖ్యలు చేసింది సాక్షాతూ సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. ఎవరైనా వారి మీద ఎలాంటి లైంగిక దాడి జరుగకూడదని, అలాంటి అనుభవాలు ఉండకూడదని కోరుకుంటారు. కానీ ప్రీతి మాత్రం ఇందుకు విరుద్దంగా స్పందించింది. తనపైనా లైంగిక దాడి జరిగి ఉండే బాగుండేదని, తనకు కూడా ఒక మీటూ కథ ఉండేదని వాగింది. దీని వెనకాల ఒక ఆసక్తికర కారణం లేకపోలేదు.

ప్రీతి జింటా ఇటీవల బాలీవుడ్ హంగామా అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిధంగా స్పందించింది. ప్రీతి మాట్లాడుతూ… “మన సమాజంలో మిగతా రంగాలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో లైంగిక దాడులు చాలా తక్కువగా జరుగుతాయి. కొందరు ఆరోపించిన మాత్రాన ఇండస్ట్రీని తప్పుబట్టడం ఏం బాలేదు. నాకు ఒక మీటూ కథ ఉంటే బావుండు దీని మీద ఇంకా ఎక్కువగా స్పందించేదాన్ని… అవకాశాలు వచ్చిన సమయంలో స్వీటు అవకాశాలు రానప్పుడు మీటుగా మారే ప్రమాదం ఉంది జాగ్రత్త” అంటూ హాస్యంతో స్పందించింది. ఈ కామెంట్ల మీద నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక స్త్రీ అయి ఉండి స్త్రీల ఉద్యమం పట్ల ఇలాంటి హాస్యాస్పద కామెంట్స్ చేయడం సబబు కాదని హితవు పలుకుతున్నారు.

Telugu News Preity Zinta controversial comments on mee too movement