అమెరికాలో  ప్రేమ ఎంత మధురం - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో  ప్రేమ ఎంత మధురం

October 24, 2017


దాదాపు 30 సంవత్సరాల క్రితం వచ్చిన ‘అభినందన’ సినిమాలోని ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అనే పాట గుర్తుందా…ఇపుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తీసారు. చంద్రకాంత్ , రాధికా మెహరోత్రా హీరో,హీరోయిన్లుగా ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. ఈచిత్రానికి ఉన్న విశేషం ఏంటంటే..సాధారణంగా  మన సినిమావాళ్లు పాటల కోసం, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకోసం విదేశాలకు వెళ్తుంటారు. కానీ ‘ప్రేమ ఎంత మధురం’ సినిమా మొత్తం అమెరికాలో తీసారు. ఈమధ్యే విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాకు  గోవర్థన్. జి దర్శకత్వం వహిస్తున్నారు. రఘురామ్‌ రొయ్యూరు,శ్రీకాంత్ పద్మనాభణ్, గోవర్ధన్ గజ్జెల సహనిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై  ఈ సినిమా తెరకెక్కబోతోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిధ్ధంగా ఉంది.